ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి త్రుటిలో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద నారాయణ స్వామి ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి వస్తున్న మరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఏపీ ఉపముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు దెబ్బతింది.
ఎస్కార్ట్ వాహనం ఒక్కసారిగా ఆగటంతో కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొన్నాయి. నారాయణస్వామికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీచదవండి: పోలీసు శాఖను కుదిపేస్తున్న ఐపీఎల్ బెట్టింగ్