ETV Bharat / state

Munagala Ramalingeswara Temple sculptures : మునగాల ఆలయంలో పురాతన విగ్రహాలు లభ్యం - తెలంగాణ వార్తలు

Munagala Ramalingeswara Temple sculptures: సూర్యాపేట జిల్లా మునగాల రామలింగేశ్వర ఆలయంలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ఆలయ అభివృద్ధి పనుల కోసం తవ్వుతుండగా... 16 విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు దేవాదాయశాఖ అధికారులకు సమాచారం అందించారు.

Munagala Ramalingeswara Temple sculptures, munagala statues
మునగాల ఆలయంలో పురాతన విగ్రహాలు లభ్యం
author img

By

Published : Dec 13, 2021, 2:58 PM IST

Munagala Ramalingeswara Temple sculptures : సూర్యాపేట జిల్లా మునగాలలోని రామలింగేశ్వర హనుమాన్ ఆలయంలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ఇటీవల ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టారు. మూడు వసతి గదులు నిర్మించేందుకు పునాదులు తవ్వుతుండగా.. 16 విగ్రహాలు లభ్యమయ్యాయి. దేవాలయం కాకతీయుల కాలం నాటిది కావడంతో నాటి విగ్రహాలుగా గ్రామస్థులు భావిస్తున్నారు.

Munagala Ramalingeswara Temple sculptures, munagala statues
తవ్వుతుండగా విగ్రహాలు లభ్యం

దేవాలయ అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు వసతి గదులు నిర్మించేందుకు తాడ్వాయి వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్​ తొగరు సీతారాములు ముందుకొచ్చారు. పునాదుల కోసం ఆదివారం గుంతలు తీస్తుండగా... 7 అడుగులు తవ్వేసరికి విగ్రహాలు బయటపడ్డాయి.

రామలింగేశ్వర ఆలయంలో 16 విగ్రహాలు

వాటిలో నాలుగు అడుగుల ఎత్తున్న మహావిష్ణు విగ్రహం, శ్రీదేవి, భూదేవి, రుక్మిణి, సత్యభామ, వేణుగోపాల స్వామి, లక్ష్మణుడు, అల్వార్లు, ద్వారపాలకులు, లక్ష్మి నారాయణ స్వామి విగ్రహాలు లభ్యమైనట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు దేవాదాయశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఆలయంలో బయటపడిన విగ్రహాలు

ఇదీ చదవండి: Modi Varanasi Visit: వారణాసిలో ప్రధాని మోదీపై పూలవర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.