సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో యూరియా కొరతపై జిల్లా వ్యవసాయ శాఖాధికారి జ్యోతిర్మయి సమీక్ష జరిపారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. జిల్లాకు 30 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా.. ప్రస్తుతం 29 వేల మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని తెలిపారు.
హుజూర్నగర్ మండలానికి 4,700 మెట్రిక్ టన్నుల యూరియా పడుతుంది. ఇప్పటి వరకు 2,685 మెట్రిక్ టన్నుల ఎరువును రైతులు కొనుగోలు చేశారని.. ఇంకా 2,000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అవసరమని అన్నారు.
యూరియా అధికంగా వాడటం వల్ల తెగుళ్లు ఎక్కువగా వచ్చి పంట దిగుబడి తగ్గుతుందని జ్యోతిర్మయి హెచ్చరించారు. తెగుళ్లు వచ్చినప్పుడు రసాయన మందులు వాడటం వల్ల భూ సారం తగ్గి పంట దెబ్బతింటుందన్నారు. అవసరమున్నంత వరకు మాత్రమే యూరియాను వాడాలని సూచించారు. రైతులు యూరియా కొనుగోలు చేసేటప్పుడు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని తెలిపారు.