ETV Bharat / state

మరికొద్దిసేపట్లో హుజూర్​నగర్​లో ఉప ఎన్నికల ప్రచారానికి తెర... - రసవత్తరంగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో గడువు ముగుస్తుండటం వల్ల పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. విజయం సాధించేందుకు ఊరూరా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.

పరస్పర విమర్శనాస్త్రాలతో తుది దశకు చేరిన ప్రచారం
author img

By

Published : Oct 19, 2019, 2:13 PM IST

పరస్పర విమర్శనాస్త్రాలతో తుది దశకు చేరిన ప్రచారం

ఓట్లు, సీట్ల కోసమే సీఎం జిమ్మిక్కులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడితే...ఆయన పిట్టలదొర అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రతి విమర్శలు చేశారు. తెరాస, కాంగ్రెస్ వల్లే హుజూర్ నగర్ వెనుకబాటుకు గురైందని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. పరస్పర విమర్శనాస్త్రాలతో ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంది.

ప్రచారపర్వంలో హస్తం నేతలు

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. పాలకవీడు మండల కేంద్రం నుంచి నేరేడుచర్ల, గరిడేపల్లి మీదుగా మఠంపల్లి వరకు రోడ్ షో కొనసాగింది. అన్ని చోట్లా ప్రసంగించిన రేవంత్ కేసీఆర్ సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఆత్మగౌరవం కోసమైనా పద్మావతిని గెలిపించాలని ఓటర్లను కోరారు.

పట్టణంలో సైదిరెడ్డి ప్రచారం..

తెరాస అభ్యర్థి సైదిరెడ్డి హుజూర్ నగర్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్ నేరేడుచర్ల మండలం రోళ్లవారి గూడెంలో ఓటర్లను కలిశారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ నేరేడుచర్ల మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

రామారావు తరపున రాజాసింగ్..

భాజపా అభ్యర్థి రామారావు తరఫున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం చేశారు. కోదాడ రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి నుంచి లింగగిరి రోడ్డు వరకు రోడ్ షో నిర్వహించారు.

నన్నే గెలిపించండి : కిరణ్మయి

తెదేపా అభ్యర్థి కిరణ్మయి నియోజకవర్గ కేంద్రంలో ఓట్లు అభ్యర్థించారు. అభివృద్ధి కోసం తెదేపాను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
నేడు సైతం కాంగ్రెస్ నేతల రోడ్ షో సాగనుంది. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తమ అభ్యర్థి తరఫున ప్రచారం చేయనున్నారు.

ఇవీ చూడండి : సీఎల్పీ నేత భట్టి సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్

Intro:Body:

vyas

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.