ETV Bharat / state

8 క్లస్టర్లుగా సూర్యాపేట... అధికారులతో కమిటీ

కంటైన్మెంట్, రెడ్​జోన్లతో కట్టుదిట్టంగా మారిన సూర్యాపేటలో... ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటైంది. పాజిటివ్ కేసులు బయటపడ్డ వార్డుల్లో... 200 మీటర్ల పరిధి వరకు గల ప్రాంతాన్ని పూర్తి కట్టుదిట్టం చేశారు. పట్టణాన్ని 8 క్లస్టర్లుగా చేసి... నిత్యావసరాల కోసం ప్రత్యేక వసతులు అందుబాటులో ఉంచాలని సమీక్షలో నిర్ణయించారు.

8 clusters in suryapeta
అధికారులతో కమిటీ
author img

By

Published : Apr 27, 2020, 12:24 PM IST

హైఅలర్ట్ కొనసాగుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో... అధికారులు కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. జిల్లా అధికారులతో మంత్రి జగదీశ్ రెడ్డి... కలెక్టరేట్​లో సమీక్ష నిర్వహించారు. హోల్​సేల్ మార్కెట్లను అందుబాటులోకి తేవడం ద్వారా... ఇబ్బందులు లేకుండా చూడొచ్చన్న అభిప్రాయానికి వచ్చారు. హోల్​సేల్ దుకాణాల ద్వారా అన్ని ప్రాంతాలకు సరకుల్ని సరఫరా చేయాలని... మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశించారు.

సంచార బజార్లు..

సూర్యాపేట పురపాలికలో సంచార బజార్ల ద్వారా అమ్మకాలు చేపట్టాలని తీర్మానించారు. హోల్​సేల్ దుకాణాల కోసం... ఎస్వీ డిగ్రీ కళాశాలతోపాటు కిరాణ వర్తక సంఘం ఫంక్షన్ హాలు అనువైనదిగా భావించారు. వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతూ.. ఔషధాలు అవసరమైన వారికి... ఇంటింటికి సరఫరా చేసేందుకు వీలుగా 22 దుకాణాలకు అనుమతులు ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా... ప్రత్యేక కమిటీని నియమించారు. డీఎస్పీ, పురపాలిక కమిషనర్, ఫుడ్ ఇన్సిపెక్టర్​, డ్రగ్ ఇన్సిపెక్టర్, పురపాలిక ప్రత్యేకాధికారితో కూడిన బృందం... కార్యకలాపాలు పర్యవేక్షించనుంది.

ఒక్క సూర్యాపేటలోనే 54 కేసులు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి మినహా... నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మొత్తం 98 కొవిడ్- 19 కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 83 మందికి పాజిటివ్ రాగా... కేవలం సూర్యాపేట పట్టణంలోనే 54, ఆత్మకూరు(ఎస్) మండలంలో 15, తిరుమలగిరిలో 7, నాగారం మండలంలో 6, నేరేడుచర్లలో ఒక కేసు నమోదయ్యాయి.

నలుగురు డిశ్చార్జి..

గత మూడు రోజులుగా ఎలాంటి కేసులు నమోదు కాకపోగా... అనుమానితులందర్నీ క్వారంటైన్లకు తరలించారు. ఇప్పటికీ ఇంటింటి స్క్రీనింగ్ కొనసాగుతోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు... రోజుకు మూణ్నాలుగు వార్డుల చొప్పున ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నాయి. 83 పాజిటివ్ కేసుల్లో... ఇప్పటికే నలుగురు డిశ్చార్జి అయ్యారు.

ఈనెల 19 నుంచి కేసులు లేవు..

నల్గొండ జిల్లాలో 15 కేసులకు గాను.. జిల్లా కేంద్రంలో 12, దామరచర్లలో 2, మిర్యాలగూడలో ఒక కేసు నిర్ధారణవగా... కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో వల్ల ఈనెల 19 నుంచి ఒక్క పాజిటివ్ కూడా నమోదు కాలేదు. సూర్యాపేటకు అనుబంధంగా ఉండే ప్రాంతాల్లో... ప్రత్యేక చెక్​పోస్టుల ద్వారా రాకపోకలకు వీలు లేకుండా చూస్తున్నారు.

ఇవీ చూడండి: తెరాస భవన్​లో కేసీఆర్ పతాకావిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.