రోజు రోజుకు బయటపడుతున్న కొవిడ్ కేసులతో సూర్యాపేట జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ఇవాళ 16 పాజిటివ్ కేసులు నమోదు కాగాా... ఒకే కుటుంబానికి చెందిన 14 మంది వైరస్ బారిన పడ్డారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య... వీటితో 39కి చేరుకుంది. గత శనివారం 11 కేసులు నమోదవగా... ఆ రికార్డును అధిగమిస్తూ ఈ రోజు ఏకంగా 16 మందిలో పాజిటివ్ లక్షణాలు నిర్ధరణయ్యాయి.
అందులో జిల్లా కేంద్రానికి సంబంధించి 14 మందితోపాటు... తిరుమలగిరిలో ఒకరు, ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరుకు చెందిన ఆరేళ్ల బాలుడు ఉన్నారు. మొత్తం 39 కేసుల్లో... జిల్లా కేంద్రంలోనే 28 ఉండటం వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరును తెలియజేస్తోంది. కొత్తగూడెం బజారుకు చెందిన ఓ వ్యక్తి వల్ల ఆయన కూతురు ఇప్పటికే వ్యాధి బారిన పడగా... ఆయన కుటుంబానికే చెందిన ఇంకో 14 మందికి పాజిటివ్ వచ్చింది.
ఇదీ చూడండి : బత్తిని పేరుతో నకిలీ మెడిసిన్..