సిద్దిపేట జిల్లా దుబ్బాక కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా ఉపాధి లేక కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న హమాలీ, ఆటో, బీడీ, భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వారికి వెంటనే రూ. 7500 చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను మార్చే విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
ఇదీ చూడండి : ఉద్యోగిపై నుంచి టిప్పర్ లారీ దూసుకెళ్లింది