సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటలో మహిళలు పోరు బాట పట్టారు. గ్రామంలో మద్యం బాటిళ్లను రోడ్డుపై పగలగొట్టారు. రోజూ మద్యం తాగి వస్తూ ఇళ్లల్లో విలువైన వస్తువులను పగులగొడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి డబ్బు లేకపోతే ఒంటి మీదున్న బంగారం, వెండి తీసుకెళ్తున్నారని వాపోయారు. రాజక్కపేటలో మద్యం ఎవరు అమ్మినా కొన్నా భారీ జరిమానా విధించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఉద్యోగం పోయిందనే మనస్థాపంతో ఆర్టీసీ డ్రైవర్ మృతి!