సముద్రాలకు చెందిన బొప్పరపల్లి కనకవ్వ అనే మహిళా రైతు పెట్రోల్ డబ్బాతో తన కుమారులతో కలిసి సిద్దిపేట జిల్లా కోహెడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. తమకు వారసత్వంగా వచ్చిన 13 ఎకరాల వ్యవసాయ భూమిని ఇద్దరు అన్నదమ్ములం చెరో ఆరున్నర ఎకరాల చొప్పున పట్టా చేయించుకోవడం జరిగిందని కనకవ్వ కుమారులు తెలిపారు.
ఇద్దరు అన్నదమ్ముల పేరు మీద డిజిటల్ పట్టా బుక్కులు వచ్చినా రైతుబంధు డబ్బులు ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఉన్న ఎమ్మార్వో తమ పేరు మీద చెరో ఆరున్నర ఎకరాలు మొత్తం 13 ఎకరాల భూమిని పట్టా చేయగా, భూమితో సంబంధం లేని ఇతర వ్యక్తులు చెప్పిన మాటలు విని ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ తమ పట్టా బుక్కు ఖాతా నెంబర్ ను రద్దు చేసి, రైతుబంధు వర్తింప చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తమకు ఎలాగైనా రైతుబంధు వర్తింపచేయాలని కనకవ్వ కన్నీరుకారుస్తూ అధికారులకు విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: తల్లికి అంత్యక్రియలు జరిపి ఐదుగురు కుమారులు మృతి