ETV Bharat / state

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన.. - wife-protest-for-husband-at-siddipet

ఫేస్​బుక్​లో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నాక భార్యను వదిలి భర్త వెళ్లిపోయాడు.

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన..
author img

By

Published : Sep 10, 2019, 5:15 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో భర్త కాపురానికి రావట్లేదని అతని ఇంటి ముందు భార్య బైఠాయించింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన భారతికి సిద్దిపేట జిల్లాకి చెందిన రంజిత్​కు నాలుగేళ్ల క్రితం ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం పెద్దలను ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నారు.

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన..
పెద్దలకు దూరంగా కొన్నాళ్లు ఉన్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. సజావుగా సాగుతున్న సంసారంలో మనస్పర్థలు వచ్చాయి. తనను హింసిస్తున్నాడని భారతి వాపోయింది. కాపురానికి రావట్లేదని, తనను తన పిల్లలను పట్టించుకోవడం లేదని భర్త ఇంటి ముందు బైఠాయించింది. తన భర్తను తనకు అప్పగించి న్యాయం చేయాలని వేడుకుంటోంది. గ్రామంలోని మహిళలు ఆమెకు మద్ధతు తెలిపారు.

ఇవీ చూడండి: ఆకతాయిలతో నడిరోడ్డుపై గుంజీలు తీయించిన యువతి

Intro:TG_KRN_101_10_BHARTHA ENTI_MUNDHU BHARAYA_BYTAYIMPU_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-------------------------------------------------------------కాపురానికి రావట్లేదని భర్త ఇంటి ముందు భార్య బైటాయింపు

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో భర్త కాపురానికి రావట్లేదని భర్త ఇంటి ముందు భార్య తన ఇద్దరు ఆడ పిల్లలతో బైఠాయించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యల పల్లి గ్రామానికి చెందిన భారతి అనే యువతి కి గౌరవెల్లి కి చెందిన మజ్జిగ రంజిత్ తో 4 ఏండ్ల క్రితం ఫేస్ బుక్ వాట్సాప్ లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నారు. పెద్దలకు దూరంగా వీరిమధ్య కొన్నాళ్లపాటు కాపురం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఈ మధ్య తన భర్త తనను హింసిస్తున్నారని భారతి వాపోయింది. కాపురానికి రావట్లేదని, తనను తన పిల్లలను పట్టించుకోవడం లేదని తన భర్త ఇంటి ముందు బైటాయించింది. విషయం తెలుసుకున్న అత్త మామలు ఇంటికి తాళం వేసి ఏటో వెళ్లిపోయారు. తన భర్తను తనకు అప్పగించి న్యాయం చేయాలని వేడుకుంటోంది భారతి. గ్రామంలోని మహిళ లు కూడా భారతి కి మద్దతు తెలిపారు.Body:బైట్
1) భారతి బాధితురాలుConclusion:భర్త ఇంటి ముందు భార్య బైఠాయింపు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.