ETV Bharat / state

'వంటిమామిడి మార్కెట్​ను మరింత అభివృద్ధి చేస్తాం'​ - సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, వసతి గృహాలకు వంటిమామిడి మార్కెట్​ నుంచే కూరగాయలను సరఫరా చేయాలని సిద్దిపేట కలెక్టర్..​ సంబంధిత అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాల కోసం మార్కెట్​ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

We will further develop the vanti mamidi market says siddipet collector
'వంటిమామిడి మార్కెట్​ను మరింత అభివృద్ధి చేస్తాం'​
author img

By

Published : Jan 29, 2021, 1:21 PM IST

సీఎం కేసీఆర్​ సూచనల మేరకు వంటిమామిడి మార్కెట్ విస్తరణతో పాటు.. ఇతర సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం నాడు ఆయన మార్కెట్​ను సందర్శించారు. మార్కెట్ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, వసతి గృహాలకు వంటిమామిడి మార్కెట్​ నుంచే కూరగాయలను సరఫరా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యచరణను సిద్ధం చేయాలని వారికి సూచించారు. మార్కెట్​లో భద్రత ఏర్పాట్లపై సీపీతో చర్చించారు.

కోల్డ్ స్టోరేజ్ నిర్మాణంతో పాటు ప్రాథమిక సదుపాయాల కల్పనకు అనువైన స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాల కోసం మార్కెట్​ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

రైతుల నుంచి ఏజెంట్​లు 4శాతం కంటే ఎక్కువ కమీషన్​ను తీసుకోవద్దని కలెక్టర్​ హెచ్చరించారు. ఆ దిశగా అధికారులు నిత్య పర్యవేక్షణ చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో.. ఏఎఫ్​డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సీపీ జోయల్ డేవిస్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'వంటిమామిడి నుంచి కూరగాయలు సరఫరా చేయొచ్చా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.