రాష్ట్రంలో ఓ వైపు పెట్రోల్, డీజిల్‌ధరలు చుక్కలను తాకుతుంటే.. కొన్ని పెట్రోలు బంకుయాజమాన్యాలు సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. పరిమాణంలో తేడాలు, కొలతల్లో తేడాలు, చివరకు డీజిల్‌లో నీళ్లు ఇలా ఏ అవకాశాన్ని వదలడం లేదు. తాజాగా ఇటువంటి ఘటనే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగింది.
నాట్లు సీజన్కావడం వల్ల ఓ రైతు బంకుకుపోయి డీజిల్ కొట్టించుకుని పొలంలో దమ్ము చేయడం మొదలు పెట్టాడు. కొంతసేపటికే బండి ఆగిపోయింది. ఓ ఆటోడ్రైవర్ డీజిల్ పోయించుకుని కిరాయికి వెళ్తుండగా ఒక్కసారిగా బండిఆగిపోయింది. ఇలా ఒకరా ఇద్దరా.. సుమారు ఓ 50 మంది వాహనాలు ఇదేవిధంగా మొరాయించాయి. అప్పుడు తేలిన విషయం ఏమిటంటే.. ట్యాంకులో డీజిల్‌కు బదులు నీళ్లు ఉన్నాయని.. ఆరా తీస్తే.. బంకులో డీజిల్‌తో కలిపి నీళ్లు కొట్టారు.
నాట్లు పని ఉందని పొద్దున్నే వచ్చి ట్రాక్టర్లో డీజిల్ పోయించుకుని వెళ్లాను. కాసేపటికే బండి ఆగిపోయి ఎయిర్‌లాక్ అయిపోయింది. ఏంటని చూస్తే ట్యాకులో నీరుంది. దాన్ని బాటిల్ తెచ్చి బంకు యజమానికి చూపించాను. వాళ్లు సరైన సమాధానం చెప్పడం లేదు. మీ బండి డీజిల్ ట్యాంకుకే చిల్లుపడి ఉంటుంది. వర్షం నీళ్లు వెళ్లిపోయి ఉంటాయంటున్నారు. నాలాగే సుమారు ఓ 50మందికి పైగా వాహనాలు ఇదే సమస్యతో ఆగిపోయాయి. మేమంతా బంకు దగ్గరకు వచ్చి ధర్నా చేశాం. - బాధితుడు.
బాధితులంతా కలిసి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. హుస్నాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్ బంకు వద్దకు వచ్చి... బంకును సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కల్తీ శాంపిళ్లను పరీక్ష కేంద్రానికి పంపినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: వెలుగులోకి మరో పెట్రోల్ బంకు మోసం