ETV Bharat / state

మే నెలాఖరునాటికి వాటర్​ ట్రీట్మెంట్​ ప్లాంట్​ పనులు! - smita sabarwal planted saplings at mission bhageeratha plant

వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్​లోనే సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని మిషన్​ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్​ ఆదేశించారు. సిద్దిపేట్​ జిల్లా కొండపాక మండలం తిప్పారం, సింగారం గ్రామాల్లో చేపడుతున్న ఇన్​టేక్​వెల్ పనులు, మంగోల్​లో జరుగుతున్న మిషన్ భగీరథ డబ్ల్యూటీపీ పనులను పరిశీలించారు.

smitha sabarwal
మే నెలాఖరునాటికి వాటర్​ ట్రీట్మెంట్​ ప్లాంట్​ పనులు!
author img

By

Published : Nov 27, 2020, 11:59 AM IST

మల్లన్న సాగర్ జలాశయం నుంచి మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు తాగునీరు అందించే ఇన్​టేక్​ వెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను మే నెలాఖరులోగా పూర్తిచేయాలని మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంజినీర్లను ఆదేశించారు. కొండపాక మండలం తిప్పారం, సింగారం గ్రామాల్లో చేపడుతున్న ఇన్​టేక్​వెల్ పనులు, మంగోల్​లో జరుగుతున్న మిషన్ భగీరథ డబ్ల్యూటీపీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల ప్రగతిని ప్రతీరోజు సమీక్షించాలని ఇంజినీర్లకు సూచించారు.

సిద్దిపేట జిల్లా కోమటిబండలోని మిషన్​ భగీరథ ప్లాంట్​ క్యాంపస్.. కార్పొరేట్​ కార్యాలయం కంటే బాగుందని స్మితా సబర్వాల్ కితాబిచ్చారు. ట్రీట్మెంట్ ప్లాంట్​ను ఈఎన్సీ కృపాకర్​రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం అక్కడ ఆవరణలో మొక్కలు నాటారు. నాలెడ్జ్ సెంటర్​ను సందర్శించారు. కోమటి బండ ప్లాంట్, పరిసరాల్లో పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఈఈ రాజయ్యకు సూచించారు.

smitha sabarwal
మొక్క నాటుతున్న స్మితా సబర్వాల్​

ఇప్పటి వరకు మిషన్ భగీరథ సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలను హైదరాబాద్​ కేంద్రంగా నిర్వహించామని.. ఇకనుంచి ట్రీట్మెంట్ ప్లాంట్​ క్యాంపస్​లో నిర్వహించాలని ఆదేశించారు. ఆ దిశగా వార్షిక క్యాలెండర్ సిద్ధం చేయాలని నిర్దేశించారు.

smitha sabarwal
మిషన్​ భగీరథ అధికారులు​

ఇవీచూడండి: నివర్ ఎఫెక్ట్: 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.