ETV Bharat / state

బోరు బావి నుంచి ఉబికివస్తున్న నీరు - Siddipet district latest news

ఒకప్పుడు తాగేందుకు చుక్క నీరు దొరకలేదు. తాగు నీరు కోసం గ్రామపంచాయతీ పరిధిలో బోరు బావి తవ్వించినా మొదట్లో నీరు మామూలుగానే వచ్చేవి. కానీ ప్రస్తుతం ఆ బోరు బావి నుంచి నీరు పైకి ఉబికివస్తున్నాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో చోటుచేసుకుంది.

Water overflowing from a bore well in Siddipet district
బోరు బావి నుంచి ఉబికివస్తున్న నీరు
author img

By

Published : Feb 7, 2021, 8:55 AM IST

Updated : Feb 7, 2021, 9:17 AM IST

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదులనగర్‌లో తాగునీటి కోసం గ్రామపంచాయతీ పాలకవర్గం బోరుబావిని తవ్వించింది. మొదట్లో నీరు మాములుగానే వచ్చింది. గతంలో కురిసిన వర్షాలకు భూగర్భజలాలు బాగా పైకి వచ్చాయి. చెరువులు కుంటలు నిండాయి.

బోరు బావి నుంచి ఉబికివస్తున్న నీరు

దీంతో చెరువు సమీపంలో తవ్వించిన బోరుబావి కేసింగ్​ నుంచి నీరు పైకి ఉబికి వస్తున్నాయి. విషయం తెలిసిన గ్రామస్థులు వచ్చి చూసి వెళుతున్నారు. ఆ నీరు మొత్తం పక్కనే ఉన్న చెరువులోకి వెళ్లడంతో నీటిమట్టం బాగా పెరిగే అవకాశం ఉందని వారు చర్చించుకుంటున్నారు.

ఇదీ చదవండి: కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

Last Updated : Feb 7, 2021, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.