సిద్దిపేట జిల్లా తొగుట మండలం వరదరాజపల్లి గ్రామ సరిహద్దుల్లో డంపింగ్ యార్డులో నిరంతరాయంగా వ్యర్థ పదార్ధాలు, ప్లాస్టిక్ కవర్లు గుట్టలుగుట్టలుగా పారేసి తగలబెడుతున్నారు. ఇలా తగలపెట్టడం వల్ల వచ్చే బూడిద దమ్మయ చెరువు, కాషాయ కుంటల్లోకి చేరడం వల్ల ఆ నీరు కలుషితమై, చెడు వాసన వస్తోందని వరదరాజపల్లి గ్రామస్థులు వెల్లడించారు. కలుషిత వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల గ్రామంలోని చెరువులో చేపలు చనిపోతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయకట్టు చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి పశువులు, పక్షులు ఆ చెరువులో నీళ్లు తాగి చనిపోయే ప్రమాదముందని .. వీటితో పాటు ఆ నీరు పొలాల్లో చేరడం వల్ల పంటలు సరిగ్గా పండవని వాపోయారు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని.. ఎలాంటి ప్రాణనష్టం, ధననష్టం జరగకుండా చూడాలని గ్రామప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా