సిద్దిపేట జిల్లా తొగుట మండలం గోవర్ధనగిరి గ్రామ శివారులో ఎయ్యా నారాయణ వ్యవసాయ బావి వద్ద కట్టేసిన పెయ్య దూడను గుర్తు తెలియని జంతువు కొరికి చంపేసింది. భయాందోళనకు గురైన రైతులు... చిరుత పులి.. దూడను చంపేసి ఉంటుందని భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తొగుట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఫరాజ్ అహ్మద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.
పులి సంచారమే లేదు..
దూడని కొరికి చంపింది గుంటనక్కా లేదా అడవి కుక్క అయ్యిండొచ్చని చిరుత పులి కాదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంతవరకు చిరుత పులి సంచారమే లేదని స్పష్టం చేశారు. రైతులు ముందు జాగ్రత్తగా పశువులను రాత్రి వేళల్లో సురక్షిత ప్రాంతాల్లో లేదా ఇంటి వద్ద ఉంచాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి : నిమ్స్‌లో కొనసాగుతున్న కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్