సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ, కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ తెరాస కార్యకర్తలు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నిర్ణయంతో.. రాష్ట్రంలో భూ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.
రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన విధానాలను ఓర్వలేక తెలంగాణ రైతుల మోటర్లకు మోదీ మీటర్లు పెట్టాలని చూస్తున్నారని ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానాన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : 'పెట్టుబడిదారీ మిత్రుల కోసమే వ్యవసాయ బిల్లులు'