సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాలలో భాజపా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు తెరాస వైపు ఉన్నారన్నారని తెలిపారు.
మధ్యంతర ఎన్నికలు రావటం తన దురదృష్టమని తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా తనను ఆశీర్వదిస్తే... రామలింగారెడ్డి ఆశయాలను నెరవేరుస్తానన్నారు. అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు.