కేజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని కేజీబీవీ వద్ద గిరిజన నాయకులు నిరసన తెలిపారు. గిరిజన విద్యార్థినులను భాష, కులం పేరుతో దూషిస్తోందని ఆరోపించారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, స్థానిక భాషలో మాట్లాడితే జరిమానా విధిస్తూ భయాందోళనలకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు గిరిజన సంఘాల నాయకులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. సంబంధిత అధికారిణిపై చర్యలు తీసుకోవాలని అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో గిరిజన నాయకులు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: పాలమూరులో యథేచ్ఛగా మట్టి దందా