రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో.. ఓవ్యక్తి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం గొల్లపల్లి శివారులో ఈఘటన జరిగింది. గుర్రాల కుమార్ తన ట్రాలీఆటోలో జగదేవపూర్ నుంచి రాత్రి తిరిగి వస్తుండగా.. గ్రామశివారులోని మూలమలుపు వద్ద ఎదురుగా వచ్చిన కారును ఢీ కొట్టింది.
తీవ్రగాయాలతో కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బంధువులు కోరుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు.
ఇదీ చూడండి: ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం