లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు విపరీతంగా రహదారులపైకి వస్తున్నారు. దీనితో రహదారులపై రద్దీ నెలకొంటుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రధాన రహదారులు రద్దీగా మారాయి. దీనితో పోలీసులే ట్రాఫిక్ పోలీసులుగా వ్యవహరించి.. ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
పట్టణంలోని ప్రధానకూడలి అయిన అంబేడ్కర్ చౌరస్తాలో సీఐ రఘ సిబ్బందితో కలిసి ట్రాఫిక్ రద్దీని సుమారు గంటసేపు నియంత్రించారు.
ఇదీ చదవండి: సెంట్రల్ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట