ETV Bharat / state

కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ దుబ్బాకలో ట్రాక్టర్ల ర్యాలీ

నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్​ రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి అన్నదాతలకు మేలు చేశారని కొత్త ప్రభాకర్​రెడ్డి అన్నారు.

tractor rally by mp kotha prabhakar reddy at dubbaka accepting new revenue act
కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ దుబ్బాకలో ట్రాక్టర్ల ర్యాలీ
author img

By

Published : Sep 23, 2020, 5:23 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ దుబ్బాక మండల రైతులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నూతన రెవెన్యూ చట్టంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ర్యాలీలో పాల్గొన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కొత్త చట్టంతో రైతుల కష్టాలు తీరుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో 33 జిల్లాలో రైతులు అందరూ సంతోషంగా రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నారని ఎంపీ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టనటువంటి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టారన్నారు. సీఎం కృషితో త్వరలోనే బంగారు తెలంగాణను సాధిస్తారని ప్రభాకర్​రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండిః దారిలేక వాగు దాటేందుకు 2 గంటలు గర్భిణీ నరకయాతన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.