సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. దిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా రైతు ఐక్యత సంఘం ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని 67 రోజులకు పైగా చలి, వర్షంలో ఇబ్బందులకు పడుతూ.. రైతులు నిరసన తెలుపుతున్నా కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడాన్ని రైతు సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.
రైతులు దేశవ్యాప్తంగా నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు రైతుల పక్షాన నిర్ణయం తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
ఇదీ చదవండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి అరుదైన గౌరవం