కాాంగ్రెస్తో దేశంలో మార్పు సాధ్యమన్న కోదండరాం దేశంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని తెజస వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానం మేరకుప్రచారంలో కోదండరాం పాల్గొన్నారు. ప్రతీ రైతుకు గిట్టుబాటు ధర, నిరుద్యోగం, పేదరికం, ఉపాధి కల్పన వంటి సమస్యలు పరిష్కరించే దిశగా హస్తం పార్టీతో చర్చించామని తెలిపారు. మహబూబాబాద్, ఖమ్మం స్థానాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామనిస్పష్టం చేశారు.
ఇదీ చూడండి :మల్లన్నసాగర్ బాధితుల సమస్యలు పరిష్కరించండి