ETV Bharat / state

Three People Fell into Pond at Siddipet : బతుకమ్మ వేడుకల్లో అపశ్రుతి.. చెరువులో చెత్తను తొలగిస్తూ ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మృతి - Jagdevpur mandal latest news

Three Fell into Pond at Siddipet
Three Fell into Pond
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2023, 5:32 PM IST

Updated : Oct 14, 2023, 10:24 PM IST

17:27 October 14

Three People Fell into Pond at Siddipet : జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలో ఘటన

Three People Fell into Pond at Siddipet District : సిద్దిపేట జిల్లాలో బతుకమ్మ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలోని పటేల్ చెరువులో చెత్తను తొలగిస్తూ ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతయ్యారు (Fell into Pond). ప్రతి ఏటా బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఇందులోనే బతుకమ్మలను నిమజ్జనం చేస్తుంటారు. ఈరోజు బతుకమ్మ సంబురాలు ప్రారంభం కావడంతో చెరువులో చెత్తను తొలగించేందుకు.. పారిశుద్ధ్య కార్మికులైన బాబు (25), భారతి (40), యాదమ్మలు (43) మరో ముగ్గురు కార్మికులతో కలిసి అక్కడికి వెళ్లారు.

Three People Died After Fell in a Pond in Teegul Village : చెరువు కట్ట పైనుంచి లోపలి వరకు పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ క్రమంలో చెరువు నీటిలో చెత్త పేరుకుపోయి ఉండడంతో దానిని కూడా తొలగించేందుకు అందులోకి దిగారు. ఇందులో భాగంగానే శుభ్రం చేసుకుంటూ ముందుకు కదులుతున్న క్రమంలో.. భారతి అనే పారిశుద్ధ్య కార్మికురాలు (Sanitation Workers) ఒక్కసారిగా చెరువులో పడిపోయింది. ఆమెను కాపాడే క్రమంలో యాదమ్మ, బాబు నీటిలో మునిగిపోయారు. పక్కనే మరో ముగ్గురు కార్మికులు ఇది గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు.

బైక్​తో సహా వాగులో పడి ముగ్గురు గల్లంతు.. చూస్తుండగానే..!

వారు వెంటనే చెరువులోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. మూడు గంటలకు పైగా గాలించగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్న ఆ కుటుంబాలు.. ఈ ఘటనతో రోడ్డునపడ్డాయి. మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు పారిశుద్ధ్య సిబ్బంది మృతి చెందిన ఘటనపై మంత్రి హరీశ్​రావు (Harish Rao) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల అండగా ఉంటామని, ఆదుకుంటామని హరీశ్​రావు పేర్కొన్నారు.

సూర్యలంక సముద్రతీరంలో ఏడుగురి గల్లంతు.. ముగ్గురు మృతి

Woman With Son Washed Away in Stream : ఇటీవలే ద్విచక్ర వాహనం అదుపుతప్పి వాగులో పడడంతో.. గర్భిణీ సహా మూడేళ్ల కుమారుడు మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన తూర్పాటి రమేశ్.. తన మూడేళ్ల కుమారుడిని వెంట తీసుకుని తన భార్య రాజేశ్వరితో ఆసుత్రికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో చీకటి పడింది. కొద్ది దూరమైతే ఇంటికి చేరేతారనుకుంటుండగా.. ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వాగులోకి పడిపోయింది.

దీంతో బైక్​పై ప్రయాణిస్తున్న ముగ్గురు వాగులో పడిపోయారు. రమేశ్​కు ఈత రావడంతో అతను ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. తన భార్య, కుమారుడు వాగులో గల్లంతయ్యారని.. వారిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని అతను కన్నీటిపర్యంతమయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మృత దేహాలు లభ్యమయ్యాయి.

సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లో చెరువులో పడి ఒకరి మృతి, ఇద్దరు గల్లంతు

దుకాణాలపై విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో ఏడుగురు..

Last Updated : Oct 14, 2023, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.