సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు.తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 52 వేల మంది ఆర్టీసీ కార్మికుల పొట్టకొడుతున్నారని... ఇప్పటికైనా సీఎం తన మొండి వైఖరి మాని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదు