కొండపోచమ్మ సాగర్‌ను గోదావరి జలాలతో నింపేందుకు నిర్దేశించిన అక్కారం పంపు హౌజ్ వద్ద ఎత్తిపోతలను అధికారులు సోమవారం రాత్రి షురూ చేశారు. మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన పాలనాధికారి వెంకటరామరెడ్డి పర్యవేక్షణలో కొనసాగింది.
ఇప్పటికే తుక్కాపూర్ పంప్‌హౌజ్ నుంచి గోదావరి జలాలు అక్కారం సర్జిపూల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆరు మోటార్లలో ఒకదాంతో నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అంతకు ముందు అధికారులు, ఇంజినీర్లు పూజలు చేశారు.
అక్కారం నుంచి ఎత్తిపోస్తున్న నీటితో మర్కూక్ పంప్‌హౌజ్ నిండగానే అక్కడ ఏర్పాటు చేసిన మరో ఆరు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసి కొండపోచమ్మ సాగర్‌ను నింపనున్నారు. ఇందుకు మరో రెండు రోజులు సమయం పట్టనుంది.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్ : సీఎం కేసీఆర్