చెట్లు పర్యావరణానికి ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా పెద్ద చెప్యాల పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అడవులు పెరిగితేనే వానలు కురుస్తాయన్నారు. త్వరలోనే మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ, ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణ గవర్నర్ను కలిసిన సీఎం జగన్