ETV Bharat / state

దేశానికే ఆదర్శంగా సిద్దిపేట మున్సిపాలిటీ: హరీశ్​ రావు

సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయంలో 2021-22 వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ఈ ఐదేళ్లలో మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి హరీశ్​ రావు తెలిపారు. రూ. 154 కోట్ల 43 లక్షలతో రూపొందించిన బడ్జెట్​కు మున్సిపల్​ కౌన్సిల్​ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.

siddipet municipality, minister harish rao
సిద్దిపేట మున్సిపాలిటీ, మంత్రి హరీశ్​ రావు
author img

By

Published : Apr 9, 2021, 4:07 PM IST

ఈ ఐదేళ్లలో అభివృద్ధి పరంగా సిద్దిపేట పురపాలక సంఘం.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజా భాగస్వామ్యం, మున్సిపల్​ కౌన్సిలర్ల కృషితో రోల్​ మోడల్​గా నిలిచామని చెప్పారు. సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు అధ్యక్షతన 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. రూ.154 కోట్ల 43 లక్షలతో రూపొందించిన బడ్జెట్​కు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పారిశుద్ధ్య, ఇతర కార్మికుల వేతనాన్ని 30 శాతం పెంచుతూ ప్రతిపాదించిన తీర్మానం.. అలాగే సిద్దిపేట పట్టణంలో తడి, పొడి, హానికరమైన చెత్తపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దిన డా.శాంతిని అభినందిస్తూ ప్రతిపాదించిన తీర్మానాలను కౌన్సిల్​ ఆమోదించింది.

ఎన్నో అభివృద్ధి పనులు..

ఐదేళ్లలోనే పురపాలక సంఘం ద్వారా రూ. 529 కోట్ల 35 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని హరీశ్​ అన్నారు. ప్రభుత్వం నుంచి ఇతర శాఖల నిధులు రూ.4620 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ.3690 కోట్లతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు, రూ. 163 కోట్లతో రెండు పడక గదుల గృహ సముదాయం, రూ.715 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాల, రూ.3.5 కోట్లతో అధునాతన గ్రంథాలయం, రూ.40 కోట్లతో ఐటీ పార్క్, పర్యటన హోటల్, ఫిస్కల్ స్లుడ్జ్ ట్రీట్​మెంట్ ప్లాంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డంప్ యార్డ్, ఆనందం, ఆహ్లాదం పంచుతున్న కోమటి చెరువు ఇలా ఎన్నో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని మంత్రి వివరించారు.

ఇదీ చదవండి: రాష్ట్రానికి మరో టెక్స్‌టైల్ కంపెనీ.. 1100 మందికి ప్రత్యక్ష ఉపాధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.