ETV Bharat / state

తహశీల్దార్లకు దస్త్రాలు అప్పగించిన వీఆర్వోలు!

సిద్ధిపేట జిల్లా గజ్వేల్​ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వీఆర్వోలు తమ వద్ద ఉన్న దస్త్రాలను తహశీల్దార్లకు అప్పగించారు. వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన ప్రభుత్వం వారి వద్ద ఉన్న అన్ని రికార్డులను స్వాధీనం చేసుకోవాలని తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేసింది.

author img

By

Published : Sep 8, 2020, 8:38 AM IST

Thahashildars Occupaied All Records From Vro's in gajwel
తహశీల్దార్లకు దస్త్రాలు అప్పగించిన వీఆర్వోలు!

సిద్ధిపేట జిల్లా గజ్వేల్​ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో వీఆర్వోల వద్ద నుంచి తహశీల్దార్లు పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి.. వారి వద్ద నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గజ్వేల్​ నియోజకవర్గంలోని కొండపాక, జగదేవ్​పూర్​, ములుగు, వర్గల్​, మర్కూక్​, మెదక్​ జిల్లా పరిధిలోని తూప్రాన్​, మనోహరాబాద్​ మండలాలకు చెందిన వీఆర్వోలు స్థానిక తహశీల్దార్లకు తమ వద్ద ఉన్న రికార్డులన్నీ ఒకటికి రెండుసార్లు పరిశీలించి అప్పగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక వీఆర్వోల నుంచి పూర్తి రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తహశీల్దార్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్​ ఫారెస్ట్​ను దత్తత తీసుకున్న ప్రభాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.