సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆర్టీసీ సమ్మె కాలంలో పనిచేసిన తాత్కాలిక కార్మికులు తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఇంఛార్జీ ఆర్డిఓ ముజిమిల్ ఖాన్‌కు వినతి పత్రం సమర్పించారు. 52 రోజులు పాటు సాగిన ఆర్టీసీ సమ్మెలో తాత్కాలిక కార్మికులుగా సీఎం పిలుపు మేరకు విధులు నిర్వహించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చడానికి కష్టపడి పని చేశామన్నారు. తాము నిరుపేదలమని, ప్రస్తుతం ఉపాధి లేకుండా ఉన్నామని ఆర్టీసీ సంస్థలోనే ఏదైనా ఒక తాత్కాలిక ఉద్యోగం కల్పించి ఆదుకోవాలన్నారు. రానున్న రోజుల్లో ఆర్టీసీ చేపట్టబోయే నియామకాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఇవీ చూడండి: 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం.. కాపాడిన స్థానికులు