దేశంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో వెజ్ అండ్ నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మించారని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు కొనియాడారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డితో కలిసి గజ్వేల్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి కేసీఆర్.. గజ్వేల్‌ను అన్నిరకాలుగా అభివృద్ధి చేసినట్లు రామకృష్ణారావు అన్నారు. వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్వహణ సైతం ఎంతో బాగుందన్నారు. దేశంలోనే మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దారన్నారు.
ఇవీచూడండి: 'సిద్దిపేట చాలా బాగుంది.. నా ప్రొద్దుటూరు ఇంత బాగాలేదు'