పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ప్రారంభించారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఖర్చుకు వెనకాడకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు.
సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్నగర్లో రెండో విడత లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను మంత్రి హరీశ్ రావు అందజేశారు. పేదరికమే ప్రామాణికంగా అర్హులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో 144 మంది గృహప్రవేశం చేయగా.. గురువారం రోజు 180 మంది తమ సొంత ఇళ్లలోకి ప్రవేశించారని తెలిపారు. మరో వేయి ఇళ్ల కోసం లబ్ధిదారుల పునఃపరిశీలన జరుగుతోందని వెల్లడించారు.
అనంతరం కేసీఆర్నగర్ నుంచి సిద్దిపేట పట్టణంలోని ఇతర ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసును మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
- ఇదీ చూడండి : అందివచ్చిన పని చేసుకుంటూ... ఆత్మగౌరవంగా జీవిస్తూ....