ETV Bharat / state

కొండపోచమ్మ జలాశయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్​ జలాశయం ప్రారంభ మహూర్తం ఖరారైంది. మే 29న ముఖ్యమంత్రి కేసీఆర్ జలాశయాన్ని ప్రారంభించనున్నారు.

కొండపోచమ్మ జలాశయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
కొండపోచమ్మ జలాశయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
author img

By

Published : May 26, 2020, 3:50 PM IST

తెలంగాణ రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్​ జలాశయం ప్రారంభానికి ముస్తాబైంది. మే 29 ఉదయం 11.30 గంటలకు కేసీఆర్ సాగర్​ జలాశయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మార్కూక్​ పంప్ హౌస్​లోని మోటార్లను సీఎం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి పాల్గొంటారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు దశలవారీగా నీటిని ఎత్తిపోస్తూ మార్కూక్ పంప్ హౌస్ వరకు తీసుకొచ్చారు. మార్కూక్ పంప్ హౌస్​లోని మోటార్ల ద్వారా గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ జలాశయంలోకి చేరతాయి. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం ఎఫ్ఆర్ఎల్ 618 మీటర్లు.

మేడిగడ్డ ఆనకట్ట ఎగువన కన్నెపల్లి పంప్ హౌస్​ వద్ద 88 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆ తర్వాత వివిధ దశల్లో అన్నారం, సుందిళ్ల, నందిమేడారం, గాయత్రి, అనంతసాగర్, రంగనాయక్ సాగర్, మల్లన్నసాగర్, అక్కారం పంప్ హౌసుల్లోకి పంపుల ద్వారా నీటిని ఎగువకు పంపిస్తున్నారు.

ఇప్పటికే అక్కారం పంప్ హౌస్​ నుంచి గోదావరి జలాలు మార్కూక్ పంప్ హౌస్​కు చేరాయి. మార్కూక్ లో మోటార్లను ప్రారంభిస్తే నేరుగా కొండపోచమ్మ సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలు వెళ్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది పదో దశ ఎత్తిపోతల అవుతుంది. ప్రాజెక్టులో చివరి ఎత్తిపోతల కూడా ఇదే. మిగతా జలాశయాలు, కాల్వలకు ఇక్కణ్నుంచి నీరు గురుత్వాకర్షణ ద్వారానే వెళ్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.