సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నాలుగేళ్ల క్రితం లక్షల రూపాయలు వెచ్చించి గౌరవెల్లి – గండిపల్లి ప్రాజెక్టు పనుల కోసం స్విచ్చింగ్ మోటర్లు తెచ్చి పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ యంత్రాలు వాడకపోవడం వల్ల అవి తుప్పు పట్టాయి. ప్రజాధనం వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు నిరుపయోగంగా ఉండి.. పాడవుతున్నా.. పట్టించుకునే అధికారులు కరువయ్యారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ స్విచ్చింగ్ యంత్రాలను వాడడం, లేదా తిరిగి వెనక్కి పంపించాలని కోరుతూ పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు ఆర్డీవోకు వినతి పత్రం కూడా సమర్పించినా.. చర్యలు మాత్రం శూన్యం.
ఇప్పుడు వర్షాకాలం సీజన్ కావడం వల్ల వర్షాలు ప్రారంభమై స్విచ్చింగ్ యంత్రాలు నానుతూ తుప్పు పడుతున్నాయని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి యంత్రాలు ఉపయోగించాలని గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఎండగట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆక్కు శ్రీనివాస్ హెచ్చరించారు.
ఇదీ చూడండి: విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'