ETV Bharat / state

ఉపాధి హామీ పనులకెళ్తున్న సర్పంచ్​, ఉప సర్పంచ్​లు - ఉప సర్పంచ్​లు

అధికారం చేతికి రాగానే... పరువు, ప్రతిష్ఠలంటూ అందరి నుంచి గౌరవం పొందడం కోసం ఆడంబరాల కోసం తాపత్రయపడుతుంటారు చాలా మంది నేతలు. కానీ సిద్దిపేట జిల్లా సర్పంచ్​లు, ఉప సర్పంచ్​లు మాత్రం... అధికారమున్నా రోజువారి కూలి పనులకెళ్తున్నారు.

ఉపాధి హామీ పనులకెళ్తున్న సర్పంచ్​, ఉప సర్పంచ్​లు
author img

By

Published : Jun 25, 2019, 3:50 PM IST

అధికారమున్నా రోజువారి కూలి పనులకెళ్తున్న సర్పంచ్​, ఉప సర్పంచ్​లు

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లోని గుడాటిపల్లి, తోటపల్లి గ్రామాల సర్పంచ్​లు, ఉపసర్పంచ్​లు ఉపాధి కూలి పనులకు వెళ్తున్నారు. ఇటీవలే గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికైన వీరు ఎప్పటిలాగానే రోజు వారీ కూలికి వెళ్తూ తాము... మట్టి మనుషులమని నిరూపించుకుంటున్నారు.

హుస్నాబాద్ మండలం తోటపల్లి సర్పంచ్ పోలవేని లత, ఉప సర్పంచ్ పద్మ జాతీయ ఉపాధిహామీ పథకం మొదలైనప్పటి నుంచి కూలి పనికి వెళ్తున్నారు. సర్పంచ్ భర్త సంపత్ కూడా ఈ పనికి వెళ్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తామీ పనిచేస్తున్నామని, అధికారం వచ్చినంత మాత్రాన ఇలాంటి పనులు చేయడానికేం నామోషీ లేదని చెబుతున్నారు.

గౌరవెళ్లి ప్రాజెక్టులో గుడాటిపల్లి గ్రామం ముంపునకు గురవుతోంది. ఇళ్ళు, భూములన్నీ ప్రాజెక్టులో మునిగిపోనున్నాయి. గ్రామస్థులకు ఉపాధి కల్పించేందుకు కూలీ పనులు నడుస్తున్నాయి. ముంపు గ్రామం అయినందున ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనలు చేపట్ట పోవడం వల్ల చేసే పనేమీ లేక సర్పంచ్ బద్దం రాజిరెడ్డి, ఉప సర్పంచ్ జరుకుల రేణుక కూలి పనులకు వెళ్తున్నారు. ఊరందరితో పాటే ఉపాధి హామీ పనులు చేస్తూ రోజు వారీ ఆదాయం పొందుతున్నారు.

పనుల నుంచి తిరిగొచ్చాక రెండు గ్రామాల సర్పంచ్​లు, ఉప సర్పంచ్​లు గ్రామంలో చేపట్టాల్సిన తాగు నీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు వంటి చిన్న చిన్న పనులు చేస్తున్నారు. గౌరవెళ్లి గ్రామ ప్రథమ పౌరులు ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన పరిహారం, పునరావాస ప్యాకేజీ విషయాలను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.

ఇవీ చూడండి: మొన్న ఎంపీ.. నిన్న పెళ్లి... నేడు ప్రమాణం

New Delhi, June 24, ANI: Veteran actor Rishi Kapoor, who is in New York for medical treatment, is having a great time with family and friends from the film fraternity. Ranbir Kapoor and Alia Bhatt, who were earlier shooting for their upcoming film 'Brahmastra' in Varanasi, took some time out for family and flew to New York. Also catching up with the actors were Abhishek Bachchan, Aishwarya Rai Bachchan and their daughter Aaradhya. Neetu Kapoor shared the adorable pictures on her Instagram where everybody is smiling and posing for the camera. In the pictures, Riddhima Kapoor Sahni and her daughter Samara are also striking a pose with Neetu and Rishi. Rishi has been seeking medical treatment for an unknown health condition. He had shared the news on his Twitter handle last September and added that he would be back in India soon. On the work front, Rishi Kapoor last appeared in 'Mulk' and 'Rajma Chawal'.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.