ETV Bharat / state

'కొండపోచమ్మ' పరిహారంపై గతంలో ఇచ్చిన స్టే కొనసాగుతుంది : సుప్రీం - కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు పరిహారం కేసు

కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు పరిహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పెళ్లికాని మేజర్లకు విడిగా పరిహారం ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సవాలు చేసింది. వాదనలు పరిగణలోకి తీసుకునే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని నిర్వాసితుల తరఫు న్యాయవాదులు వాదించారు. అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్వాసితులకు జస్టిస్ ఖాన్‌విల్కర్ ధర్మాసనం ఆదేశించింది.

supreme court
supreme court
author img

By

Published : Nov 16, 2020, 5:01 PM IST

కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు పరిహారం విషయంలో హైకోర్టు ఆదేశాలపై గతంలో ఇచ్చిన స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. 2013 భూసేకరణ చట్టం కింద పరిహారమివ్వాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది. పెళ్లి కాని మేజర్లకు విడిగా పరిహారం ఇవ్వాలన్న ఆదేశాలు సరికాదంది. అడ్వొకేట్‌ జనర్‌ పూర్తి వాదనలు పరిగణలోకి తీసుకోకుండానే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చింది.

తెలంగాణ ప్రభుత్వ వాదనను ప్రాజెక్టు నిర్వాసితులు వ్యతిరేకించారు. వాదనలు పరిగణలోకి తీసుకునే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని నిర్వాసితుల తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు వద్ద ప్రస్తావించారు. అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్వాసితులను ఆదేశించిన జస్టిస్ ఖాన్‌విల్కర్ ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి : జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలన్న పిల్‌పై హైకోర్టు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.