కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోవడం వల్ల జిల్లాలో కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో వంద పడకల కొవిడ్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. వీటిలో 80 సాధారణ పడకలు, 20 ఐసీయూ పడకలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి కరోనా బారినపడొద్దని ఆయన సూచించారు.
వసతులపై ఆరా..
ఈ సందర్భంగా కొవిడ్ ఐసోలేషన్ వార్డులో మంత్రి కలియ తిరిగారు. కరోనా రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులతో మాట్లాడారు. వైద్యం విషయంలో ఎలాంటి అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకురమ్మని మంత్రి సూచించారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఇదీ చూడండీ: జూరాల గేట్లు ఎత్తిన అధికారులు... శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు