సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సున్నంతో గడులు గీసి... కూర్చోవడానికి కుర్చీలు వేశారు. టోకెన్ వచ్చినప్పుడు బియ్యం తీసుకునేలా చర్యలు చేపట్టారు. దుబ్బాక తహసీల్దార్ రామచంద్రం ఆధ్వర్యంలో సర్పంచ్ దేవిరెడ్డి ఉచిత రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గ్రామంలోని ప్రజలకు 12 కిలోల బియ్యం ఇస్తున్నామని సర్పంచ్ తెలిపారు. వలస కార్మికులకు బియ్యంతోపాటు రూ. 500 నగదు అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆపరేషన్ మర్కజ్: ప్రతి రాష్ట్రంలోనూ వారి కోసం వేట