పోలీసుశాఖలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో అవార్డుకు ఎంపికైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎస్సై శ్రీధర్‌ను సీపీ జోయల్ డేవిస్ ప్రశంసించారు. కేంద్ర మంత్రిత్వశాఖ అందించే ఎన్సీఆర్బీ ట్రోఫికి ఆయన ఎంపికయ్యారు.
జిల్లా పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించినందుకు ఎస్సైకి నగదు పురష్కారాన్ని సీపీ అందించారు. ఎస్సైని స్ఫూర్తిగా తీసుకుని అధికారులు, సిబ్బంది ఆధునిక సాంకేతికను వినియోగించుకుని అవార్డులు పొందాలని సీపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నారాయణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.