సిద్దిపేటలోని ప్రధాన మార్గాల్లో జనసంచారాన్ని అంచనా వేసి... తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. సీపీ జోయ్ డేవిస్ ఆదేశాలతో ఐటీ కోర్ సిబ్బంది పలు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని పరిశీలించారు.
సిటిజన్ ట్రాకింగ్ యాప్ ఫర్ కొవిడ్-19 యాప్ సాయంతో అనుమతి లేకుండా తిరిగే వాహనాలపై నిఘా సారించనున్నట్లు పోలీసు కమిషనర్ జోయల్‌డేవిస్ తెలిపారు. కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా వాహనాల కట్టడికి తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. తొలుత చెక్‌పోస్టు, పికెట్ వద్ద ఏదైనా వాహనం కనిపిస్తే పూర్తి వివరాలు యాప్‌లో నమోదు చేస్తారన్నారు.
![డ్రోన్ కెమెరాతో తీసిన చిత్రం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6748705_sdp-gen1b_37.jpg)
అదే వాహనం లేదా వ్యక్తి మళ్లీ బయటకు వస్తే చెక్‌పోస్టు/పికెట్ వద్ద ఉన్న పోలీసు అధికారులు యాప్ సాయంతో ఎన్నిసార్లు బయటకొచ్చాడనే విషయాన్ని గుర్తించవచ్చని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చన్నారు. జిల్లాలో శుక్రవారం లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో పది కేసులు నమోదైనట్లు చెప్పారు. సిద్దిపేటలో 7, గౌరారం పోలీసు ఠాణా పరిధిలో 3 నమోదయ్యాయన్నారు. మొత్తం 82 వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు.
ఇదీ చూడండి:- అగ్రరాజ్యాలకన్నా భారత్‌లోనే మరణాల రేటు తక్కువ!