సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. పట్టణానికి చెందిన ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటిరోజు 12మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.
అందులో ముగ్గురు అభ్యర్థులు రెండు సెట్ల నామపత్రాలు ఎన్నికల అధికారికి అందజేశారు. అధికార తెరాస పార్టీ నుంచి 10 నామినేషన్లు, భాజపా-2, కాంగ్రెస్-2, సీపీఐ నుంచి ఒక నామినేషన్ దాఖలయింది.