సిద్దిపేట మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కడవేర్గు మంజుల, వైస్ ఛైర్మన్గా జంగిటి కనకరాజు ఎంపికయ్యారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్లతో పాటు 43 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం కౌన్సిలర్లు అందరూ ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. కలెక్టర్ వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. పురపాలక సంఘం నూతన పాలక వర్గానికి మంత్రి, ఎంపీ అభినందనలు తెలిపారు. ఛైర్పర్సన్ మంజులను సత్కరించారు.
ఇటీవల జరిగిన సిద్దిపేట పురపోరులో తెరాస తెరాస తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 43 స్థానాల్లో తెరాస 36 స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు ఐదు చోట్ల విజయం సాధించారు. ఇక భాజపా, ఎంఐఎం ఒక్కో స్థానం దక్కించుకున్నాయి. ఏ ఒక్క వార్డులోను కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.
ఇదీ చూడండి: గ్రేటర్ వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణి