ETV Bharat / state

'మా భూములను లాక్కోవద్దని చెప్పండి' - భూమి కోసం బండి సంజయ్​ను కలిసిన గ్రామస్థులు

తమ భూములను కాపాడాలని కోరుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్​ మండలం ముట్రాజపల్లి, లింగరాజ్ పల్లి రైతులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ని కలిసి విజ్ఞప్తి చేశారు. 15 రోజుల్లో ఆయా గ్రామంలో పర్యటించి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

'మా భూములు లాక్కోవద్దని చెప్పండి'
'మా భూములు లాక్కోవద్దని చెప్పండి'
author img

By

Published : Jan 5, 2021, 11:45 AM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్​ మండలం ముట్రాజపల్లి, లింగరాజ్​పల్లికి చెందిన పలువురు రైతులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను కలిశారు. తమ భూములను ప్రభుత్వం తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని... ఆవేదన వ్యక్తం చేశారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే చాలా భూమి కోల్పోయామని.. అయినప్పటికీ మరికొంత భూమి ఇవ్వాలని ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టరు డిమాండ్ చేస్తూ... బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల విజ్ఞప్తిపై స్పందించిన బండి సంజయ్​ గ్రామాల్లో పర్యటించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ మనోహర్ యాదవ్, టౌన్ అధ్యక్షుడు నత్తి శివకుమార్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్రజల వద్దకే పాలన... మంత్రి అజయ్ మార్నింగ్ సైక్లింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.