కార్తిక మాసంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొత్త కలెక్టరేట్, పొలీస్ కమిషనరేట్, నర్సాపూర్‌లో నిర్మించిన రెండు పడకల గృహాల ప్రవేశానికి ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి చెప్పారు. సిద్ధిపేట జిల్లా దుద్దెడ గ్రామ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్, కమిషనరేట్, నర్సాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మాణ పనులను సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జిల్లా, డివిజన్ స్థాయిలో నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు రెండు రోజుల్లో ప్రారంభోత్సవ ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించి బ్లాకుల వారీగా, అన్నీ శాఖలకు జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సమక్షంలో గదులను కేటాయింపు చేశారు. పలుచోట్ల అసంపూర్తి పనులన్నీ పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
అనంతరం పోలీసు కమిషనరేట్ అసంపూర్తి పనులన్నీ తొందరగా పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. కమిషనరేట్ భవనంలోని కార్యాలయాల సుముదాయాల గదులను బ్లాకులు, అంతస్తుల వారీగా పరిశీలించారు. నర్సాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: 'కొండపోచమ్మ' పరిహారంపై గతంలో ఇచ్చిన స్టే కొనసాగుతుంది : సుప్రీం