తెలంగాణ భాజపా బంద్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బంద్ చేయాలని కోరుతూ జిల్లా నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. సుభాష్ రోడ్డు బస్టాండ్ మీదగా ర్యాలీ చేస్తున్న సమయంలో సిద్దిపేట రెండో పట్టణ పోలీసు అధికారులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగ రామచంద్రారెడ్డి, బీజేపీ మాజ్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి అంబడిపల్లి శ్రీనివాస్, భాజపా కిసాన్ మోర్చా జిల్లా నాయకుడు బందరం కనకరాజు, నాయకులు మోతు శ్రీనివాస్,పాము పడగే వేణుగోపాల్, డాబా నరేష్, రాము తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా