ETV Bharat / state

ఘనంగా శివరాత్రి ఉత్సవాలు.. ఆలయాల్లో జాగారాలు - సిద్దిపేట జిల్లాలో శివపార్వతుల వేడుకలు

మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకున్న భక్తులు.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రంతా భక్తి గీతాలు పాడుతూ జాగారం చేశారు.

Shivaratri celebrations are in full swing at the Rajeshwara Swamy Temple
రాజేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
author img

By

Published : Mar 12, 2021, 12:06 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలోని శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామి వారిని దర్శించుకోవడానికి రాత్రివేళలోనూ వేల సంఖ్యలో భక్తులు ఆలయం ఎదుట బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శివరాత్రి వేళ ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో చేసే జాగారం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాత్రంతా ప్రత్యేక గీతాలు పాడుతూ భక్తులు జాగారం చేసి స్వామి వారిని కీర్తించారు.

మరోవైపు జిల్లాలోని కోహెడ మండలం కూరెల్ల గ్రామంలోని శివాలయంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో జాగారం చేశారు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లోని పలు ఆలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి.

ఇదీ చదవండి: 'విద్యుత్ సమస్యలపై ఫోరంను ఆశ్రయించవచ్చు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.