ETV Bharat / state

ఎమ్మెల్యే కాన్వాయిని అడ్డుకున్న శివసేన నాయకులు

సన్నవరి పండించిన రైతులను ఆదుకోవాలంటూ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే సతీశ్​కుమార్ కాన్వాయిని శివసేన నాయకుడు మల్లిఖార్జున రెడ్డి అడ్డుకున్నారు. సన్నవరి ధాన్యం పండించి తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యేకు విన్నవించారు. కారు నుంచి దిగివచ్చిన సతీశ్​కుమార్ రోడ్డుపై బైఠాయించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

author img

By

Published : Dec 2, 2020, 4:06 PM IST

Shiv Sena leaders block MLA convoy in siddipeta dist
ఎమ్మెల్యే కాన్వాయిని అడ్డుకున్న శివసేన నాయకులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే సతీశ్​కుమార్ కాన్వాయిని శివసేన నియోజకవర్గ ఇన్​ఛార్జ్ మల్లిఖార్జునరెడ్డి అడ్డుకున్నారు. సన్నవరి ధాన్యం పండించి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. కారు నుంచి దిగివచ్చిన ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సన్నవరి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.2500 మద్దతు ధర చెల్లించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. తరుగు పేరిట కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లర్లు బస్తాకు మూడు నుంచి నాలుగు కిలోలు ధాన్యం కోత విధిస్తున్నారని సతీశ్​కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. రైతుల కష్టాలపై స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి:నిబంధనలు ఉల్లంఘిస్తే... జరిమానాలు తప్పవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.