సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని విద్యా సరస్వతి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఆలయ వ్యవస్థాపకులు రాయవరం చంద్రశేఖర సిద్ధాంతి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
వర్గల్‌లోని శంభుని గుట్టపై స్వయంభువుగా వెలసిన సరస్వతి మాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి తెల్లవారుజామునుంచే విశేష పూజలు చేశారు. అనంతరం నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేసి.. పూజా కార్యక్రమాలు చేపట్టారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చంద్రశేఖర సిద్ధాంతి తెలిపారు.