ETV Bharat / state

11% వడ్డీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది: హరీశ్​ రావు - telangana news today

చెప్పిన మాట ప్రకారం మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలకు మొత్తం 11% వడ్డీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. ఈ మేరకు బడ్జెట్​లో మూడు వేల కోట్ల రూపాయలు కేటాయింపు చేశామని వెల్లడించారు. సిద్దిపేటలో 103 మహిళా స్వయం సహాయక సంఘాలకు 6.30 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు.

self help groups loan 11% interest is borne by the telangana government
11% వడ్డీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది: హరీశ్​ రావు
author img

By

Published : Mar 21, 2021, 10:20 PM IST

మహిళా సంఘాల బలోపేతానికై పావలా వడ్డీ రుణాల చెల్లింపు కోసం సీఎం కేసీఆర్ బడ్జెట్​లో 3,000 కోట్లు కేటాయింపు చేశారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు తెలిపారు. సిద్దిపేటలో 103 మహిళా స్వయం సహాయక సంఘాలకు 6.30 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల.. మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క తులసి చెట్టును అందించారు.

కేంద్ర ప్రభుత్వం పావలా వడ్డీకి నాలుగు శాతం, రాష్ట్ర ప్రభుత్వం ఏడు శాతం భరించాల్సి ఉందని కానీ... తెలంగాణ ఆడపడుచులపై సీఎం కేసీఆర్ ప్రేమతో మొత్తం 11% వడ్డీ రాష్ట్ర ప్రభుత్వంమే భరిస్తుందని హరీశ్​ రావు వెల్లడించారు. భారమే అయినప్పటికీ మహిళా సంఘాలకు ఇచ్చిన మాట మేరకు.. నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. సిద్దిపేట ప్రజలకు 20 పడకల ఐసీయూ కేంద్రం, సిటీ స్కాన్ కేంద్రం వసతులను ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. పట్టణ ప్రజలతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఆ సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని హరీశ్​ రావు కోరారు.

ఇదీ చూడండి: రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలి: హరీశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.